Site icon NTV Telugu

YCP Social Media: సోషల్‌ మీడియాపై వైసీపీ స్పెషల్‌ ఫోకస్‌.. నియోజకవర్గాల వారీగా టీమ్‌లు..

Ysrcp

Ysrcp

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సామాజికి మాధ్యమాల సామూహాన్ని పటిష్టం చేశారు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా బాధ్యతల్ని ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తూ రాగా.. ఈ మధ్యే.. సజ్జల భార్గవ్‌కు సోషల్‌ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ కార్పొరేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతల్ని పర్యవేక్షించడానికి ఐ అండ్‌ పిఆర్‌కు అనుబంధంగా మొదట్లో డిజిటల్‌ డైరెక్టర్‌ను నియమించారు. ఆ తర్వాత దానిని ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. సోషల్‌ మీడియాలో విపక్షాల నుంచి ఎదురవుతోన్న సవాళ్లకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చే విధంగా.. ఓ టీమ్‌ను తయారు చేసుకున్నారు..

Read Also: Central Funds: ఏపీ, యూపీ సహా ఈ రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్‌..

అయితే, ఇది కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. జిల్లాస్థాయిలో.. చివరకు నియోజకవర్గాల స్థాయిలోనే విస్తరించేందుకు ప్లాన్ చేసిన వైసీపీ.. అందులో భాగంగా ఇప్పుడు మరో ముందడుగు వేసింది.. నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించింది.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు నుంచి ఆరుగురిని సోషల్ మీడియా వింగ్‌ కింద నియమించింది.. అంటే, కేవలం రాష్ట్రస్థాయిలో సోషల్‌ మీడియాలో కౌంటర్‌ ఇస్తే సరిపోదని.. నియోజవర్గాల వారీగా టీమ్‌లు ఉంటే.. అక్కడ పార్టీ, ప్రభుత్వ ప్రచారంతో పాటు.. విపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలకు వెంటనే కౌంటర్‌ ఇవ్వాలనే ప్లాన్‌లో భాగంగా.. వైసీపీ నియోజకవర్గాల వారీగా టీమ్‌లను నియమించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంది.. బీజేపీ కూడా పరవాలేదు.. ఇప్పుడు అధికార వైసీపీ.. వారందరికీ కౌంటర్‌ ఇచ్చేలా స్పెషల్‌ వింగ్‌తో రెడీ అవుతోంది.

Exit mobile version