Site icon NTV Telugu

YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన.. ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు

Ycp

Ycp

YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. నకిలీ మద్యంతో చనిపోయిన వారికి అండగా వైసీపీ పోరాటం చేస్తుంది.. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో 20 వేల లీటర్ల నకిలీ మద్యం దొరికింది.. చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా నకిలీ మద్యం తయారీ చేయగలరా అని ప్రశ్నించింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని సూచించింది. మాపై నకిలీ మద్యం లిక్కర్ కేసులు‌ పెట్టారు.. ఇప్పుడు నిజంగానే వారు దొరికారు అని ఎద్దేవా చేసింది. జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు అయితే చంద్రబాబు ఎలా ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు అని క్వశ్చన్ చేసింది. చంద్రబాబు అనుభవం అంతా అవినీతి డబ్బు కోసమే.. చంద్రబాబు సిగ్గు లేకుండా సిట్ వేస్తానని చెబుతున్నాడు‌‌.. సిట్ వల్ల ఉపయోగం లేదు‌.. సీబీఐ విచారణ కావాలని ఆర్కే రోజా డిమాండ్ చేసింది. అయితే, పవన్ కు లిక్కర్ స్కాంలో ముడుపులు అందాయని ఆరోపించింది. ప్రశ్నించాల్సిన పవన్ సైలెంట్ గా ఉన్నాడంటే అతడికి పెద్ద ఫ్యాకేజ్ అందిందని పేర్కొన్నారు. కిలారి రాజేష్ ద్వారా లోకేష్ కు మద్యం ముడుపులు అందాయి.. కల్తీ మద్యం అమ్మకాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.

Read Also: Jubilee Hills by-election: రేపటిలోపు అభ్యర్థిని ప్రకటిస్తాం.. గెలిపించాలని కోరుతున్న..!

మరోవైపు, కల్తీ మద్యంపై వైసీపీ నిరసన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీ ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు అని పెట్టుకో అని సూచించారు. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు.. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు నువ్వు కట్టిన తాళ్ళను పరా పరా తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు అన్నారు. నీ గన్ మెన్ లు ఉన్న నిన్ను టీడీపీ కార్యకర్తలు కొట్టకపోతే నన్ను అడుగు అన్నారు. కడుపు రగిలిపోయి సచ్చిపోతున్నారు, అల్లాడి ఏడుస్తున్నారు.. మన ఇంట్లో వాళ్ళు భాష, శివ రామ కృష్ణ, సమాధులు దొడ్డి దగ్గర ఉన్న బాబాయ్ ఈ కుమ్ముడికి జెండా మోసిన కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారని పేర్నినాని తెలిపారు.

Exit mobile version