టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు సానుభూతి రాజకీయాలకు తెరలేపారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘అన్ని ఎన్నికల్లో ఓడి తలబొప్పి కట్టడంతో సానుభూతి కోసం కుప్పంలో వీధి నాటకాలకు తెరతీశాడు చంద్రబాబు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులు చేయించాడు. తనపైనే ఎవరో దాడి చేస్తున్నట్లు నిద్దట్లో కలవరిస్తూ ఆ ఫస్ట్రేషన్ జనంపై చూపిస్తున్నాడు. ఏంటి బాబు ఈ డ్రామాలు? ఓట్ల కోసం ఈ పాట్లు’ అని విజయసాయి ట్వీట్ చేశారు.
Read Also: టీఆర్ఎస్ అధినేత ఏపీలో పార్టీ పెడతారా.?
కాగా కుప్పం పర్యటనలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బహిరంగసభ వద్దకు చేరుకుని కలకలం రేపాడు. ఆ వ్యక్తి బాంబు తెచ్చాడని టీడీపీ కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనపై దాడి జరగబోయిందంటూ ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. సానుభూతి కోసం చంద్రబాబుకు డ్రామాలు ఆడటం కొత్తేమీ కాదంటూ విమర్శలు చేస్తున్నారు.
