లోకేష్‌కి కాలం దగ్గర పడింది… ఇకపై ఏదీ రాదు: విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం గడువు త్వరలోనే ముగుస్తుందని.. అందుకే లోకేష్ తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత లోకేష్‌కు ఏ పదవీ వచ్చేది లేదనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడంటూ లోకేష్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
లోకేశ్ బరితెగింపు చూస్తుంటే…MLC పదవీకాలం గడువు దగ్గర పడుతోంది. తర్వాత ఏ పదవి దక్కేది లేదు. అందుకే తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడు. అమరావతి పేరుతో లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక, అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడు పప్పు.
Also Read
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 29, 2022
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. అసలు మద్యం సిండికేట్లకు లైసెన్సిచ్చిందే మాజీ సీఎం చంద్రబాబు అని ఆరోపించారు. వంగవీటి రంగా హంతకులకు వైజాగ్‌ను కానుకగా రాసిచ్చి భూదందాలకు, భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రకటనకు ముందే వేల ఎకరాల భూములను కొనిపించింది ఎవరు..? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ఏదో జరుగుతోందంటూ తండ్రీ, కొడుకులు బెదరగొడుతున్నారంటూ టీడీపీ నేతలపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
రంగా హంతకులకు వైజాగ్‌ను కానుకగా రాసిచ్చి భూదందాలకు, మద్యం సిండికేట్లకు లైసెన్సిచ్చిందే చంద్రబాబు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రకటనకు ముందే వేల ఎకరాల భూములను కొనిపించింది ఎవరు? ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ఏదో జరుగుతోందంటూ బెదరగొడుతున్నారు తండ్రీ, కొడుకులు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 30, 2022
తాజావార్తలు
-
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
-
Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
-
David Warner: “అలా చేయడానికి వీల్లేదు”.. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
-
Sankranti 2027 Box Office Clash : 2027 సంక్రాంతి పోరు బాక్సాఫీస్ వద్ద భారీ మల్టీస్టారర్లు, క్రేజీ కాంబినేషన్ల మోత
-
Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి మాదే.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. ట్రంప్ హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!