VijayaSaiReddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ మూవీ అనూహ్య వసూళ్లను సొంతం చేసుకుంది. తాజాగా బెంగళూరులో జరిగిన సైమా అవార్డుల్లో పుష్ప మూవీ దుమ్ము రేపింది. అనేక కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత మొత్తం ఆరు కేటగిరీల్లో పుష్ప సినిమా అవార్డులు దక్కించుకుంది. ఈ సందర్భంగా పుష్ప సినిమాపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మేరకు పుష్ప సినిమాను అభినందిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న ‘పుష్ప’ చిత్రం యూనిట్ కు అభినందనలు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతం. తెలుగు సినిమా తగ్గేదే లే అని నిరూపించారు’ అంటూ విజయసాయిరెడ్డి కొనియాడారు. దీంతో ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప ది రూల్ తెరకెక్కుతోంది. ఈ సినిమా త్వరలోనే పుష్ప సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ మూడోవారంలో అల్లు అర్జున్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారడని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.
పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న 'పుష్ప' చిత్రం యూనిట్ కు అభినందనలు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతం. తెలుగు సినిమా 'తగ్గేదే లే' అని నిరూపించారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2022