NTV Telugu Site icon

పాల వెల్లువ కార్యక్రమంపై టీడీపీ రాద్ధాంతం చేస్తోంది: అప్పలరాజు

జగనన్న పాల వెల్లువ కార్యక్రమం పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మేమేదో పాపం చేసినట్టు, అమూల్‌కి సంపద దోచిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. అమూల్‌ అనేది ప్రైవేట్‌ సంస్థ కాదు.. సహకార సంస్థ రాష్ట్రంలో ఉన్న సహకార సంస్థలు అన్నింటిని చంద్రబాబు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలుగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. పాడి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాంసంగం డెయిరీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులని మంత్రి పేర్కొన్నారు.

Read Also: ఆ సెంటర్‌కు జిన్నా పేరు తొలగించాలి: సోము వీర్రాజు

ప్లాన్ ప్రకారం మాక్స్ యాక్ట్ లోకి దూళిపాల్ల కుటుంబం మార్చేశారు. సహకార సొసైటీలకు ఇచ్చినట్లే గ్రామాలకు ఇస్తున్నాం. గ్రామ స్థాయిలో పెట్టబోయే మహిళా సొసైటీలకు ఆస్తులను ఇస్తున్నామని, అమూల్‌ కేవలం మార్కెటింగ్‌ మాత్రమే చేస్తుందన్నారు.ఈ సందర్భంగా మంత్రి సవాల్‌ విసిరారు. సంగం డెయిరీ, హెరిటేజ్‌లను దమ్ముంటే కో ఆపరేటివ్‌ సొసైటీలుగా మార్చాలని డిమాండ్‌ చేశారు.
ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న దొంగ ధూళిపాళ్ల నరేంద్ర అని మండిపడ్డారు. దూళిపాళ్ల నరేంద్రకు సీఎం జగన్‌ను విమర్శించే కనీస అర్హత లేదని మంత్రి తెలిపారు.