NTV Telugu Site icon

Pothula Sunitha: వైఎస్ భారతమ్మను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు

Pothula Sunitha

Pothula Sunitha

ycp leader pothula sunitha counter to vangalapudi anitha: టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితపై వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ సతీమణి గురించి మాట్లాడే హక్కు అనితకు లేదని పోతుల సునీత వ్యాఖ్యానించారు. మహిళలను నమ్మించి మోసం చేసే పార్టీ టీడీపీ అని.. అనిత కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతోందని పోతుల సునీత మండిపడ్డారు. భారతి అంటే అనితకు భయం ఉండటం సహజం అని.. చంద్రబాబు మాట్లాడిస్తున్న మాటలు ఇవి అని.. ఆయనవి నీతిమాలిన రాజకీయాలు అని ఆరోపించారు. టీడీపీ నేతలు భారతమ్మను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఇంత చిన్న వయసులో ఇంత మంచి పనులు చేస్తున్నారు కాబట్టి టీడీపీ నేతలు కుళ్లుకుంటున్నారని చురకలు అంటించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్ర ఆదాయాన్ని పేద ప్రజల కోసమే జగన్ ఖర్చు చేస్తున్నారని పోతుల సునీత వివరించారు. తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఏపీ ప్రజలు సహించరని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు.

టీడీపీ నేతలు రాజకీయాలు చేయాలంటే ఒక పద్ధతిగా చేయాలని… అందులోకి ఇంట్లో మహిళలను లాగొద్దని పోతుల సునీత హెచ్చరించారు. లేదంటే చంద్రబాబు, లోకేష్‌కు మహిళలు బుద్ధి చెప్తారన్నారు. సూట్ కేసులు దాచుకునే నీచమైన వ్యవహారం టీడీపీ నేతలదే అని కౌంటర్ ఇచ్చారు.పోలవరాన్ని ఏటీఎం చేసుకుంది టీడీపీ నేతలే అని.. ఇలాంటి దోపిడీ చూసే ప్రజలు గత ఎన్నికల్లో ఇంటికి పంపారని పోతుల సునీత ఆరోపించారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని.. ఆయన చేసిన దానికి ప్రజలు బుద్ధి చెప్పారని.. 2024లోనూ టీడీపీకి అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.

Read Also: POLAVARAM ISSUE LIVE: పోల వరం ఎవరికి? శాపం ఎవరికి?

అంతకుముందు జగన్, ఆయన భార్య వైఎస్ భారతిపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపణలు చేశారు. జగన్ చేసే తప్పుల్లో ఆయన భార్య భారతికి భాగముందన్నారు. ఒకప్పుడు భారతి జగనుకు హారతి ఇచ్చేందుకే పరిమితమయ్యేవారని.. ఇప్పుడు జగన్ భార్య భారతి అవినీతిలో భాగమయ్యారని విమర్శలు చేశారు. భర్తను వెనకేసుకురావడం, భర్త తెచ్చిన సూట్ కేసులు లెక్కేసుకోవడం వంటివి భారతి చేస్తున్నారన్నారు. భర్త చేస్తున్న తప్పులను ప్రచార ఆర్భాటాలకు ఉపయోగించడం వంటి పనులను భారతి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ మూడేళ్ల అరాచక పాలనంతా ఐరన్‌లెగ్ మయంగా మారిందన్నారు. బాధితులను ఆదుకోకపోగా కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లించే దొంగల ముఠా జగన్‌ది అని.. ప్రజా సంక్షేమం దేవుడెరుగు తాను అనుకున్న పని జరగాలి, తన జేబు నిండాలనేదే జగన్ మనస్తత్వమని మండిపడ్డారు. కోవిడ్ బాధితులకు కేంద్రం ఇచ్చిన రూ. 1100 కోట్లు నిధులను దారి మళ్లించడం దోపిడీ విధానమే అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి రూ.2 వేలు అకౌంటులో జమ చేశామంటున్నారని.. వాటి లెక్కలు చెప్పే దమ్ము, ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని వంగలపూడి అనిత సవాల్ విసిరారు.