NTV Telugu Site icon

YSRCP: కర్నూలు జిల్లా వైసీపీలో బయటపడ్డ లుకలుకలు

Ycp

Ycp

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గానికి చెందిన 20 మంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమైన తర్వాత కౌన్సిల్ మీట్‌కు వెళ్లకూడదని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని మేయర్ బీవై రామయ్యపై కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వర్గం కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అందుకే పనులు జరగడం లేదంటూ మేయర్ బీవై రామయ్య వర్గీయులు చెప్తున్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో హాజరైన కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు ప్రతిపక్ష పాత్ర వహించారు.

అటు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎటువంటి సమాచారం లేకుండా అధికారులు శానిటరీ ఇన్‌స్పెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేశారని కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 52 వార్డులు ఉన్నాయి. పాణ్యం 16, కోడుమూరు 3, కర్నూలు 33 వార్డులు ఉండగా.. 25 మంది వైసీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు.

Andhra Pradesh: సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారు