NTV Telugu Site icon

Yarlagadda Venkata Rao: కన్ఫ్యూజన్‌లో యార్లగడ్డ.. ఏ పార్టీ అనేది నో క్లారిటీ

Yarlagadda Venkat Rao

Yarlagadda Venkat Rao

Yarlagadda Venkata Rao Says He Will Contest From Gannavaram: ఒకప్పుడు వైసీపీలో ఎంతో యాక్టివ్‌గా ఉండే యార్లగడ్డ వెంట్రావు.. గత రెండేళ్ల నుంచి అజ్ఞాతంలో వెళ్లారు. ఓవైపు వల్లభనేని వంశీతో విభేదాలు, మరోవైపు ఆరోగ్య సమస్యల కారణంగా.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయిన ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీ అనేది తనకే క్లారిటీ లేదని కుండబద్దలు కొట్టారు. ఏ పార్టీ నుంచి రాజకీయాల్లో కొనసాగుతారో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. టీడీపీలోకి వెళ్తున్నారా? అని ప్రశ్నిస్తే.. ‘ఛీ, ఎవరు చెప్పారు’ అంటూ మండిపడ్డారు. మరి వైసీపీలో ఉన్నారా? అని అడిగితే.. అది అడగాల్సిన వాళ్ళని అడగాలంటూ సమాధానం ఇచ్చారు. టీడీపీ, వైసీపీ కాకపోతే.. ఏ పార్టీ నుంచి కొనసాగుతారు? అంటే.. ఊహాజనిత ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తామని తిరిగి ప్రశ్నించారు. సీఎం జగన్‌తో సమావేశమైన తర్వాత.. దీనిపై తాను నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.

MLA Raghunandan Rao : బీఆర్‌ఎస్‌ పార్టీ కండువ ఎసుకున్న వారికే కులవృత్తుల సహాయం

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. తాను గత రెండు సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నానని అన్నారు. రాజకీయాల్లో ఉన్న ఇబ్బందుల వల్ల తాను తనవారికి ఏం చేయలేకపోయానే తప్ప.. వాళ్లను తరచూ కలుస్తూనే ఉన్నానని అన్నారు. తాను గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. తాను ఎన్నికల్లో ఓడిపోయాక అమెరికా వెళ్తానని ప్రచారం చేశారని.. కానీ తాను గన్నవరంలోనే ఉన్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. నూజివీడులో కోర్టు కేసు ఉండటం వల్ల తాను ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు. అనివార్య కారణాలతోనే 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గ కార్యకర్తలతో దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. కాగా.. ఇప్పుడు యార్లగడ్డ మళ్లీ యాక్టివ్ అయ్యారు కాబట్టి, వల్లభనేని వంశీతో విభేదాలు మళ్లీ రగలడం ఖాయం. మరి.. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరిలో ఎవరికి సీటు దక్కుతుందో? పార్టీ హైకమాండ్ ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

Malleshwari Case: పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని.. భర్త ఏం చేశాడంటే?

Show comments