Loan App Harassment: అకౌంట్లో డబ్బులు వేయకుండానే.. మహిళకు వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Harassed By Loan App In East Godavari Without Receiving Loan: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రానురాను మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వీరి వేధింపులు భరించలేక ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. అయినా వీరిలో మార్పు రాకపోగా.. జనాల్ని వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. అకౌంట్లో డబ్బులు వేయకుండానే.. డబ్బులు కట్టాలంటూ ఓ మహిళను వేధించారు లోన్ యాప్ నిర్వాహకులు. లేకపోతే న్యూస్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
MLA Kannababu: చంద్రబాబు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి.. బీజేపీకి కన్నుకొడుతున్నాడు
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే కనకదుర్గ అనే మహిళ.. తనకు డబ్బులు అవసరమై, రూపీ పే యాప్‌ను డౌన్లోడ్ చేసింది. ఆన్లైన్ లోన్ యాప్‌లో తన ఆధార్ కార్డ్, పాన్ కార్డు వివరాల్ని అప్లోడ్ చేసింది. అనంతరం తనకు రూపీ పే యాప్ నుండి డబ్బులు వస్తాయని వేచి చూసింది. అయితే.. ఆమెకు డబ్బులు రాలేదు కానీ, నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తీసుకున్న డబ్బులను ఈనెలాఖరులోగా కట్టాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తనకు లోన్ యాప్ నుండి ఎలాంటి డబ్బులు రాలేదని కనకదుర్గ ఎంత చెప్పినా.. వాళ్లు పట్టించుకోకుండా ఆమెని డబ్బులు కట్టాల్సిందేనంటూ నిలదీశారు. ఈనెల 29వ తేదీన డబ్బులు కట్టకపోతే.. పరువు తీస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు వెంటనే ‘దిశ SOS’కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది.
Naresh : పవిత్రా లోకేష్ తో పిల్లల్ని కంటే తప్పేంటి?.. నరేష్ షాకింగ్ కామెంట్స్..
తాను రూపీ పే యాప్‌లో ఎలాంటి రుణం తీసుకోకపోయినప్పటికీ.. తనని వేధింపులకు గురి చేస్తున్నారని, ఆ లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కనకదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని దిశ పోలీసులు సూచించారు. ఇటీవల సరిగ్గా ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. తనకు ఫోన్ పే నుంచి గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి డబ్బులు రాగా.. ఆ మహిళ వెంటనే తిరిగి పంపింది. అయినా ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ.. ఓ వ్యక్తి అదే నంబర్ నుంచి కాల్ చేసి వేధించాడు.
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!