NTV Telugu Site icon

Loan App Harassment: అకౌంట్‌లో డబ్బులు వేయకుండానే.. మహిళకు వేధింపులు

Loan App Harassment

Loan App Harassment

Woman Harassed By Loan App In East Godavari Without Receiving Loan: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రానురాను మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వీరి వేధింపులు భరించలేక ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. అయినా వీరిలో మార్పు రాకపోగా.. జనాల్ని వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. అకౌంట్‌లో డబ్బులు వేయకుండానే.. డబ్బులు కట్టాలంటూ ఓ మహిళను వేధించారు లోన్ యాప్ నిర్వాహకులు. లేకపోతే న్యూస్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

MLA Kannababu: చంద్రబాబు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి.. బీజేపీకి కన్నుకొడుతున్నాడు

బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే కనకదుర్గ అనే మహిళ.. తనకు డబ్బులు అవసరమై, రూపీ పే యాప్‌ను డౌన్లోడ్ చేసింది. ఆన్‌లైన్ లోన్ యాప్‌లో తన ఆధార్ కార్డ్, పాన్ కార్డు వివరాల్ని అప్‌లోడ్ చేసింది. అనంతరం తనకు రూపీ పే యాప్ నుండి డబ్బులు వస్తాయని వేచి చూసింది. అయితే.. ఆమెకు డబ్బులు రాలేదు కానీ, నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తీసుకున్న డబ్బులను ఈనెలాఖరులోగా కట్టాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తనకు లోన్ యాప్ నుండి ఎలాంటి డబ్బులు రాలేదని కనకదుర్గ ఎంత చెప్పినా.. వాళ్లు పట్టించుకోకుండా ఆమెని డబ్బులు కట్టాల్సిందేనంటూ నిలదీశారు. ఈనెల 29వ తేదీన డబ్బులు కట్టకపోతే.. పరువు తీస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు వెంటనే ‘దిశ SOS’కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది.

Naresh : పవిత్రా లోకేష్ తో పిల్లల్ని కంటే తప్పేంటి?.. నరేష్ షాకింగ్ కామెంట్స్..

తాను రూపీ పే యాప్‌లో ఎలాంటి రుణం తీసుకోకపోయినప్పటికీ.. తనని వేధింపులకు గురి చేస్తున్నారని, ఆ లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కనకదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని దిశ పోలీసులు సూచించారు. ఇటీవల సరిగ్గా ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. తనకు ఫోన్ పే నుంచి గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి డబ్బులు రాగా.. ఆ మహిళ వెంటనే తిరిగి పంపింది. అయినా ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ.. ఓ వ్యక్తి అదే నంబర్ నుంచి కాల్ చేసి వేధించాడు.