కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసారన్న మనస్తాపంతో భర్త గుండెపోటుతో మరణించాడు. మృతుడు దాసరి రమేష్(36) బాపులపాడు మండలం ఏ. సీతారామపురానికి చెందినవాడు. కాగా రెండ్రోజుల క్రితం రమేష్ భార్య హనుమాన్ జంక్షన్ సీఐ రమణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేశామన్న వీరవల్లి పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోకపోవడం వల్లనే రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. రోడ్డుపై నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో నిందితుడి ఇంటివద్ద మృతుడితో బాధిత మహిళ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన ద్రోణాదుల జయరాజ్ గా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీసిన వీడియోను నిందితుడు గ్రామంలో వైరల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
భార్య బాత్రూం వీడియో వైరల్.. మనస్తాపంతో భర్త మృతి!
