CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు, హెచ్వోడీలు, సెక్రటరీలతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని.. అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని స్పష్టం చేశారు. దీని కోసం అవసరం అయితే బిజినెస్ రూల్స్‌ను మార్చాలని అన్నారు. పరిపాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని.. దీని కోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
Read Also: Tamannaah Bhatia : శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా ‘ఫస్ట్ లుక్’ అదుర్స్ !
ఇక, అన్ని శాఖల్లో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ, డేటా లేక్ ద్వారా మరింత సమర్థంగా పాలన అందించాలన్నారు. ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి, ప్రతి శాఖ పని తీరు ఏ విధంగా ఉందో ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉందని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ పని చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉంటూ.. విజన్‌తో ప్రతి ఒక్కరు పని చేయాలని చంద్రబాబు అన్నారు.
