What’s Today:
• ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్
• విశాఖలో నేడు మంత్రి మేరుగు నాగార్జున పర్యటన.. మధురవాడలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని సందర్శించనున్న మంత్రి నాగార్జున
• విజయవాడ: నేడు 58వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
• పల్నాడు జిల్లా: నేడు నాదెండ్ల మండలం సాతులూరులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ
• నేడు ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరోసారి రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ
• నేడు హైదరాబాద్ రానున్న జేపీ నడ్డా.. మధ్యాహ్నం 12:40 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న జేపీ నడ్డా దంపతులు.. మధ్యాహ్నం 2:40 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరుకోనున్న జేపీ నడ్డా.. మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోనున్న జేపీ నడ్డా.. సా.4:10 నుంచి బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొననున్న నడ్డా.. సాయంత్రం 6 గంటలకు వరంగల్ నుంచి హైదరాబాద్ రానున్న నడ్డా
• హైదరాబాద్: నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ సమావేశం.. క్రికెటర్ మిథాలీరాజ్ సహా పలువురు రచయితలను నడ్డా కలిసే అవకాశం
• చెన్నై: జయలలిత మృతిపై విచారణ పూర్తి.. సీఎం స్టాలిన్‌కు నివేదిక అందించనున్న రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి
• నేటి నుంచి ఆసియా కప్ ప్రారంభం.. ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్న శ్రీలంక, అఫ్ఘనిస్తాన్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Show comments