★ నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. రూ.6,594 కోట్ల మేర జగనన్న అమ్మ ఒడి పథకం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో విడుదల చేయనున్న జగన్
★ తిరుమల: నేడు సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. అందుబాటులో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లు
★ ఏలూరు జిల్లా: నేడు పోలవరం వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం.. హాజరుకానున్న, ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కోటగిరి శ్రీధర్
★ నంద్యాలలో నేడు జాబ్ మేళా
★ కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుని ఆలయంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం.. ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు 08868 238127 నెంబర్‌కు భక్తులు ఫోన్ చేసి ఇబ్బందులు చెప్పవచ్చని సూచించిన అధికారులు
★ హైదరాబాద్: నేడు, రేపు బండ్లగూడ, పోచారంలోని ప్లాట్ల విక్రయం
★ అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నేడు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు.. అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
★ ఢిల్లీ: నేడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్.. హాజరుకానున్న ప్రతిపక్ష నేతలు.. మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్.. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు
★ మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా ఏక్‌నాథ్ షిండే పిటిషన్.. విచారణ చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలా
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today