★ ఏపీలో సంక్రాంతి సెలవుల అనంతరం నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు ప్రారంభం
★ నేడు కోవిడ్, వైద్య ఆరోగ్య శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష… ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడిగింపు, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై చర్చించే అవకాశం
★ కర్నూలు: కోవిడ్ కారణంగా నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు, అన్నప్రసాద వితరణ, పుణ్యస్నానాలు రద్దు
★ నేటి నుంచి ఏపీలో మూడు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. నేడు ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌కు రానున్న వెంకయ్యనాయుడు.. రేపు వృత్తి విద్య విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశం
★ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినేట్ భేటీ… కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించే అంశంపై చర్చ
★ సికింద్రాబాద్: నేడు 36 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
★ నేడు ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం… దావోస్ సదస్సులో వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్న మోదీ.. రాత్రి 8:30 గంటలకు స్టేట్ ఆఫ్ ద వరల్డ్ అంశంపై ప్రధాని ప్రసంగం
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
