Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. మండపేటలో కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొననున్న పవన్
* ఏపీలో నేటి నుంచి ఆలయాల్లో ఏ ఖర్చుకైనా ఆడిట్ పూర్తవ్వకుండా బిల్లులు చెల్లించకూడదని ప్రభుత్వం నిర్ణయం
* బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పేటేరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ
* రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. ఈరోజు వరద ప్రవాహం 25 లక్షల క్యూసెక్కులు దాటుతుందని అధికారుల అంచనా.. గోదావరి ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల రక్షణ చర్యలు చేపడుతున్న ఇరిగేషన్ యంత్రాంగం
* నెల్లూరు జిల్లా ఆత్మకూరులో లబ్ధిదారులకు నేడు టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి
* గుంటూరు జిల్లా: నేడు చేబ్రోలు మండలం సేకూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొననున్న ఎమ్మెల్యే కిలారు రోశయ్య
* ప్రకాశం జిల్లా మార్కాపురంలో నేడు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం
* అనంతపురం పట్టణంలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో జనజాగృతి కార్యక్రమం.. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న బీజేపీ నాయకులు

Exit mobile version