* 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియోతోపాటు దూరదర్శన్‌లో ఆమె ప్రసంగం ప్రసారం కానుంది.
* విశాఖలో నేటి నుంచి ఈనెల 30 వరకు అగ్నివీర్‌ల నియామకానికి రంగం సిద్ధం.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిక్రూట్ మెంట్.. ఆన్ లైన్‌లో తొలిరోజే రిక్రూట్ మెంట్ కోసం అడ్మిట్ కార్డులు.. రాత్రే మున్సిపల్ స్టేడియానికి చేరుకున్న యువకులు.. స్టేడియం పరిసరాల్లోనే బస చేసిన అభ్యర్థులు
* నేడు విశాఖలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన
* అనంతపురం: సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తరువాత తొలిసారిగా జిల్లా వస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్.. మాధవ్ రాక సందర్భంగా భారీ కాన్వాయ్‌తో స్వాగత ఏర్పాట్లు చేస్తున్న మద్దతుదారులు
* బాపట్ల జిల్లా రేపల్లెలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ
* నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
* ఖమ్మం: ఆరో రోజుకు చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ యాత్ర.. ఉదయం పది గంటలకు కల్లూరు మండలం ఖాన్ ఖాన్ పేట నుండి ప్రారంభం కానున్న పాదయాత్ర
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today