★ నేడు సీఎం జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం
★ చిత్తూరు: నేడు కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. శీగలపల్లె ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు
★ ఏపీలో నేడు ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ పరీక్ష
★ తిరుమల: నేటితో ముగియనున్న పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు.. నేడు గరుడ వాహనంపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు
★ నెల్లూరు: నేడు బిట్రగుంటలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పర్యటన.. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్
★ కర్నూలు: నేడు కోడుమూరు మండలం ముడుమలగుర్తిలో లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి రథోత్సవం సందర్భంగా అంకురార్పణ గణపతిపూజ
★ తెలంగాణలో నేటి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి టెన్త్ పరీక్షల హాల్‌టిక్కెట్లు.. ఈనెల 23 నుంచి టెన్త్ పరీక్షలు.. పరీక్షలు రాయనున్న 5.08 లక్షల మంది విద్యార్థులు
నేడు హైదరాబాద్ రానున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్.. ఉదయం 11 గంటలకు బీజేపీ ఆఫీస్‌కు వెళ్లనున్న గోవా సీఎం
★ నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం.. ఉక్రెయిన్-రష్యా మానవీయ పరిస్థితులపై చర్చ
★ నేడు వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ సమీక్ష.. దక్షిణాసియా దేశాల నేతలతో మాట్లాడనున్న బైడెన్
★ ఐపీఎల్ 2022: నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Show comments