What’s Today:
• నేడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు.. బరిలో 1,349 మంది అభ్యర్థులు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్.. డిసెంబర్ 7న కౌంటింగ్
• నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. విశాఖలో నేవీ డే ఉత్సవాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి
• విజయవాడ: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ, గూడ్స్ వాహనాలకు అనుమతి నిరాకరణ.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మళ్లింపు
• కడప: నేడు ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనున్న మంత్రి అంబటి రాంబాబు
• అంబేద్కర్ కోనసీమ: నేడు అమలాపురం కాటన్ పార్కులో ప్రముఖ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రముఖ సినీ హాస్యనటుడు ఎల్బీ శ్రీరామ్
• నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
• నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి వన్డే.. ఢాకా వేదికగా ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New