Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

What’s Today:
• నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష.. రాత్రికి ఇడుపులపాయలోనే బస.. రేపు ఇడుపులపాయ నుంచి తాడేపల్లి వెళ్లనున్న సీఎం జగన్
• ప్రకాశం: వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కనిగిరిలో పలు కార్యక్రమాలు, హాజరుకానున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్
• జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్న జనసైనికులు.. పలుచోట్ల రక్తదాన, అన్నదాన శిబిరాల ఏర్పాటు
• నేడు తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఉదయం 11:30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న అధికారులు
• నేడు మెదక్ జిల్లాలో రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
• నేడు కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
• నేడు కేరళ, కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన.. కొచ్చిన్‌లో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించనున్న మోదీ
• ఆసియాకప్: నేడు పాకిస్థాన్ వర్సెస్ హాంకాంగ్ మ్యాచ్.. షార్జా వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

Exit mobile version