Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. ఐసీసీ మహిళా వరల్డ్‌ కప్‌లో నేడు భారత్‌-సౌతాఫ్రికా తలపడనున్నాయి. కాసేపట్లో భారత్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌ ప్రారంభం కానుంది.
  2. ఐపీఎల్‌ 2022లో నేడు ఢిల్లీ-ముంబై జట్ల మధ్య నేడు మ్యాచ్‌ జరుగనుంది. ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. సెకండ్‌ మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ బెంగుళూరు జట్లకు మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
  3. నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో 3 సీట్లు ఖాళీగా ఉంచడంపై పరిమితిని కేంద్రం ఎత్తివేసింది. ఇండిగో నుంచి మరో 100 దేశీయ విమానాలు అందుబాటులోకి రానున్నాయి.
  4. నేడు ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ జరుగనుంది. ఉదయం 11 గంటలకు మోడీ మన్‌ కీ బాత్‌లో మాట్లాడనున్నారు.
  5. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సందడి. నేడు ఏపీ భవన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ప్రదర్శించనున్నారు.
  6. నేటితో బేగంపేట ఎయిర్‌షో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు సాధారణ ప్రజలకు అనుమతించనున్నారు.
Exit mobile version