Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు సాయంత్రి 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీలో కాంగ్రెస్‌ అధిష్టానం చర్చించనుంది. భవిష్యత్‌ కార్యచరణపై కూడా సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి నియామకంపై ప్రధాన చర్చ జరుగనుంది.
  2. నేడు అమృత్‌సర్‌లో కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నెల 16న పంజాబ్‌ సీఎంగా భగవంత్‌ మాన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
  3. నేడు శ్రీశైలంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమల్లికార్జున స్వామి వారిని సాయంత్రి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకోనున్నారు.
  4. నేడు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 1,251 ఓట్లు, 17 స్థానాలకు 70 మంది బరిలో ఉన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ తర్వాత సాయంత్రం 7గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.
  5. నేడు ఖమ్మంలో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైరాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
  6. రేపు తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. ఈ రోజు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌ రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు.
  7. నేడు ఢిల్లీలో మోడీ, జేపీ నడ్డాలతో యోగి ఆదిత్యనాథ్‌ భేటీ కానున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో సమావేశం కానున్నారు.
  8. నేడు హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేశారు. 36 సర్వీసులు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Exit mobile version