Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు అధికారులు. తిరుమల శ్రీ వెంకన్నస్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

* నేడు ఏపీలో శాంతి భద్రతలపై సీఎం జగన్ సమీక్ష

* నేడు రెండవ రోజు జిల్లాలో ఒంగోలులో వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ ఎంపీ విజయసాయి రెడ్డి సమీక్ష.

* నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాకాత్ అయ్యే అవకాశం

* నేడు వెలగోడు రిజర్వాయర్ నుండి తెలుగు గంగకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. పలువురు అధికారులు హాజరు.

* నేడు ఏపీలోని పలు జిల్లాల్లో టీడీపీ నేతల సమావేశం. చంద్రబాబు అరెస్ట్‌ పై ప్రధానంగా చర్చించనున్న నేతలు.

* విశాఖలో రెండో రోజు జాతీయ స్థాయి జైళ్ల శాఖ ఉన్నతాధికారులు సమావేశం.

* నేటి నుంచి యూనివర్సిటీల్లో PG సీట్ల అడ్మిషన్ల కోసం వెబ్ కౌన్సిలింగ్

Read also: TS Heavy Rains: వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలే.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

తెలంగాణ……………..

* నేడు బిజెపిలో చేరుతున్న మాజీ మంత్రి చందూలాల్ కొడుకు డాక్టర్ ప్రహల్లద్.

* నేడు వరంగల్ బంద్. బంద్ కు పిలుపునిచ్చిన కేయూసీ విద్యార్థులు.

* నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా లోని 12 నియోజకవర్గాల బిజెపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

* నేడు హంటర్ రోడ్ లోని విష్ణు ప్రియ గార్డెన్ లో ఏర్పాటుచేసిన బిజెపి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్. ఈ నెల 15న బిజెపి చేపడుతున్న తెలంగాణ విమోచన ర్యాలీని విజయవంతం చేసేలా కార్యచరణ రూపొందించనున్న నేతలు.

* నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. రాత్రి భోజనం తర్వాత 80 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు.. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు పాఠశాల యాజమాన్యం.
Chandrababu Arrest: చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీవ్ర ఉత్కంఠ

Exit mobile version