Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

★ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు… నిత్యావసర ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ నేతల పాదయాత్రలు.. యూపీలో పాదయాత్ర ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక
★ నేటి నుంచి పాపికొండల విహారయాత్ర పున:ప్రారంభం.. తూ.గో. జిల్లా పోచవరం నుంచి ప్రారంభం కానున్న పాపికొండల విహారయాత్ర
★ విజయవాడ: నేడు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం… ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఇస్రో ఛైర్మన్ డా.శివన్, గౌరవ అతిథిగా హాజరుకానున్న ఓల్వో కంపెనీ ఎండీ కమల్ బాలి, చాగంటి కోటేశ్వరరావు, సినీ నటుడు అలీ
★ అనంతపురం: నేడు జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న మంత్రి శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
★ నేడు వరంగల్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన… కుటుంబసమేతంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న ఎన్వీ రమణ
★ నేడు యూపీలో ప్రధాని మోదీ పర్యటన… హాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌కు శంకుస్థాపన చేయనున్న మోదీ
★ నేడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సెమీస్.. పురుషుల సింగిల్స్‌లో సెమీస్ చేరిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్

Exit mobile version