Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* సంగారెడ్డి: నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ.

* నేడు సెక్రటేరియట్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

* ఉమ్మడి మెదక్ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. సంగారెడ్డి జిల్లాలో 13, సిద్దిపేట జిల్లాలో 13.9, మెదక్ జిల్లాలో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. పెరిగిన చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న జనం. పలు చోట్ల రోడ్లపై దట్టంగా కమ్ముకున్న పొగమంచు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.

* ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎంతో పాటు ముగ్గురు మంత్రుల పర్యటన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఖమ్మం, కొత్తగూడెం భద్రాచలం పర్యటన.

కాకినాడ: నేడు కాకినాడ 218వ రోజు తునిలో జరగనున్న లోకేష్ యువ గళం పాదయాత్ర.

విశాఖ: నేడు విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే వేడుకలు. నావికాదళం పరాక్రమాన్ని ప్రదర్శించే అద్భుతమైన కార్యాచరణ ప్రదర్శన. ముఖ్య అతిథిగా
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. నేవీ విన్యాసాలు వీక్షించేందుకు వేలాదిగా రానున్న ప్రజలు. ఆర్కేబీచ్ రోడ్డు సహా పలు మార్గాల్లో మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.

* శ్రీకాకుళం: పలాసలో ఇవాళ ఉదయం ఒడిశా రాష్ట్రం గోపాల్ పూర్ లో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రైవేటు ఫంక్షన్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పలాసలోని ప్రగతి భవన్ లో ప్రజలకు అందుబాటులో ఉంటారని, మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

* నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరు నగరంలోని ధర్మ వారి దివ్య వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ మైదానంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం. ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డి ఆధ్వర్యంలో వై.సి.పి.నేతల ఆత్మీయ సమావేశం.

* బాపట్ల : వేటపాలెం నాయునిపల్లి శ్రీ గంగాపార్వతీ సమేత బోగలింగేశ్వరస్వామి ఆలయ 32వ వార్షిక బిల్వర్చన కార్యక్రమం.

* ప్రకాశం: చీమకుర్తి హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి నగరోత్సవం సందర్భంగా గంగాపూజ, గణపతి పూజ, మండపారాధన, అభిషేక అభిషేకము కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.

* తిరుమల: కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం. ఇవాళ కార్తీక మాసం స్వాతి తిరునక్షత్రం కావడంతో మొదటి ఘాట్ రోడ్డులో లక్ష్మినరశింహ స్వామివారికి ప్రత్యేక అభిషేకం.

* తిరుమల:19వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం.ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేసిన టిటిడి. 23వ తేది నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం. 22వ తేది నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ లో సర్వదర్శనం భక్తులకు టిక్కేట్లు కేటాయింపు.

* అనంతపురం: ఈనెల 12 న జిల్లాలో పర్యటించనున్న కేంద్ర కరువు బృందం. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బృందం సభ్యులు.

* విజయవాడ: ఇవాళ నగరంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగే సంగీర నీరాజనంలో పాల్గొననున్నారా. అనంతరం హైదరాబాదు వెళ్ళి, అటునుంచీ డిల్లీకి పయనం కానున్నారు.

* చిత్తూరు: పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. పలు అభిరుద్ది కార్యక్రమాలలో పాల్గొనునున్న మంత్రి పెద్దిరెడ్డి.

తూర్పు గోదావరి జిల్లా :  నేడు రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు శ్రీకారం. రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు శంకుస్థాపన.  శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులు.
Fire Accident: బరేలీ-నైనిటాల్ హైవేపై పెను ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీకొని 8 మంది సజీవ దహనం

Exit mobile version