Site icon NTV Telugu

What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?

What's Today Ntv

What's Today Ntv

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై జగన్ ప్రెస్‌మీట్

ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చ.. ఎస్ఐపీబీ ప్రతిపాదనలను ఈ నెల 11న జరిగే కేబినెట్‌లో ఆమోదించే అవకాశం

ఇవాళ చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. చిత్తూరులో డీడీవో కార్యాలయం ప్రారంభించనున్న పవన్

రాజధాని కోసం రెండోవిడత ల్యాండ్ పూలింగ్ కోసం నేడు అమరావతి మండలం యండ్రాయిలో గ్రామస్థులతో సమావేశం.. సమావేశంలో పొల్గొనున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.. రెండో విడత భూసమీకరణలో పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్

నేడు పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. అనంతరం అధికారులతో మంత్రి సమీక్ష

ఇవాళ శ్రీవారి ఆలయంలో కార్తీక దీప మహోత్సవం.. ఇవాళ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు

నేడు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం జిల్లా కేంద్రంకు చేరుకోనున్న సీఎం.. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సభ.. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం

ఈరోజు, రేపు భారత్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యటన.. 25కి పైగా ఒప్పందాలపై భారత్-రష్యా సంతకాలు.. నాలుగేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న పుతిన్‌.. ఇరవై మూడో ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర భేటీకి హాజరుకానున్న పుతిన్‌.. రేపు ప్రధాని మోడీతో సమావేశం కానున్న పుతిన్‌

ఈరోజు బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ ప్రీమియర్స్.. సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడే అవకాశాలు

యాషెస్ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ మధ్య 2వ టెస్ట్ మ్యాచ్.. ది గబ్బా స్టేడియంలో ఉదయం 9.30కు మ్యాచ్ ఆరంభం

Exit mobile version