Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు ఉదయం 11 గంటలకు ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్..

నేడు ఉదయం 11 గంటలకి ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో ఒక్కొక్కరికి రూ. 15000 రూపాయలు జమ.. పాల్గొననున్న జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు..

నేడు విశాఖపట్నం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..

నేడు PHC వైద్యుల ఛలో విజయవాడకు పిలుపు.. మధ్యాహ్నం 2 గంటలకు ధర్నా చౌక్ కి చేరుకోనున్న PHC వైద్యులు.. చర్చలకు పిలుస్తామని మోహం చాటేసిన ప్రభుత్వం.. ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన వైద్యులు..

నేడు ఉదయం స్పీకర్‌ ఛాంబర్‌లో అనర్హత పిటిషన్లపై విచారణ.. ఉదయం 10 గంటలకు గూడెం మహిపాల్‌ రెడ్డిని క్రాస్‌ ఎగ్జామినేషన్ చేయనున్న BRS అడ్వకేట్‌.. ఉదయం 11 గంటలకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని క్రాస్ ఎగ్జామ్ చేయనున్న బీఆర్ఎస్ అడ్వకేట్..

నేడు హైదరాబాద్ కు ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్.. మధ్యాహ్నం 2గంటలకి సికింద్రాబాద్ చేరుకోనున్న మీనాక్షి నటరాజన్.. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై పోల్ పై చర్చ..

నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న మంత్రుల కసరత్తు.. నేడు పీసీసీకి నివేదిక ఇవ్వనున్న మంత్రులు.. ముగ్గురి పేర్లు సూచిస్తూ ప్రతిపాదన ఇవ్వనున్న మంత్రులు..

నేడు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం..

నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయాయి.. అక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైనులో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం..

నేడు కర్నూలులోని హోళగుంద మండలం దేవరగట్టులో శ్రీ మాల మల్లేశ్వర స్వామి రథోత్సవం.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు..

నేడు బీహార్ లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు.. పాట్నాలో ఈసీ ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో కీలక సమావేశం.. బీహార్ లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ.. సమావేశానికి ప్రతి రాజకీయ పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం..

Exit mobile version