NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఇటీవల కురిసిన వడగళ్ల వర్షం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ నేడు పర్యటన చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు.

* నేడు సిట్ 6వ రోజు 9మంది నిందితుల విచారించనుంది. టీఎస్పీఎస్సీ నేడు 11 గంటలకు సిట్ ఎదుట పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ కేసులో ముగ్గురిని ఎఫ్ ఐ ఆర్ కాపీ నిందితుల జాబితాలో చేర్చిన సిట్. దీంతో.. మొత్తం 12కు చేరుకున్న నిందితులు సంఖ్య.

* ఉద్యానశాఖలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 4న నిర్వహించాల్సిన పరీక్షపై గురువారం టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఈ పరీక్షను నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై చర్చించనున్నది.

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

* ఆదిలాబాద్ కేంద్రంలో సిపిఎం జన చైతన్య యాత్ర. పట్టణం లో బైక్ ర్యాలీ తరువాత ఆర్ అండ్ బి ముందు బహిరంగ సభ. హాజరు కానున్న పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.

* తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావావరణ శాఖ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ అలాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నది.

* విశాఖలో పాత రామజోగిపేటలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.

* ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైఎస్సార్‌సీపీకి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు.

* ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న సభలో పలు బిల్లులు, పలు శాఖల డిమాండ్లకు సభ్యులు ఆమోదం తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

Show comments