Tadepalligudem: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాజకీయ కక్షలు కలకలం రేపుతున్నాయి.. 38వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లగొండ స్వప్న నివాసానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.. అయితే స్థానికులు అప్రమత్తమై వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ ఘటన వెనుక జనసేన నాయకుల హస్తం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.. రాజకీయ కక్షతోనే తమ ఇంటికి నిప్పు పెట్టారని, తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.. మరోవైపు ఘటనను ఖండించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.. అసలు ఈ ఘటన వెనుక ఎవరున్నారు.. రాజకీయ విభేదాలు దాడులకు దారితీశాయా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

