Minister Nimmala Ramanaidu: ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు కేంద్రం 11,500 కోట్ల రూపాయల సహాయం అందించిందని, ఒక్కరోజు విశాఖపట్నం పర్యటనలో ప్రధాన నరేంద్ర మోడీ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రెండు లక్షల కోట్ల నిధులు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించడమే అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలోని పలు గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ విధ్వంస పాలనలో లూలూ, అమర్ రాజా, కియో వంటి పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఎగ్దేవా చేశారు. ఉపాధి లేక నిరుద్యోగులు, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలైయ్యారని ఆవేదన చెందారు. గతంలో రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలందరినీ రాష్ట్రానికి తిరిగి రప్పించి పెట్టుబడులు పెట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించేందుకు సంకల్పించామన్నారు. పోడూరు మండలంలోని ఈ ఒక్క రోజులోనే 34 చోట్ల 10 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని పనిచేసే నేటి ప్రభుత్వానికి, పనికిమాలిన గత ప్రభుత్వానికి ఇదే నిదర్శమని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు ఘాటుగా విమర్శించారు.
Minister Nimmala Ramanaidu: 20 లక్షల ఉద్యోగాలు అందించేందుకు సంకల్పించాం..
- కూటమి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపింది..
- రూ.11,500 కోట్ల సహాయం అందించింది..
- 20 లక్షల ఉద్యోగాలు అందించేందుకు సంకల్పించాం..