NTV Telugu Site icon

Nimmala Rama Naidu: డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే రాష్ట్రానికి ప్రయోజనాలు..

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిష‌న్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019కి ముందు పోల‌వ‌రం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్-1, ఫేజ్-2లను తీసుకొచ్చి జ‌గ‌న్ తీవ్రమైన తప్పిదం చేశాడని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ రెండు ఫేజ్‌లను కేంద్రానికి పంపి జగన్ చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబు హయంలో 18 నెలలు శ్రమించి పూర్తిచేసిన‌ డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేసిన జగన్.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Abhishek Sharma:అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ

పోలవరంలో జగన్ చేసిన తప్పిదాలను చంద్రబాబు సరిదిద్దుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రూ.990 కోట్లతో తిరిగి చంద్రబాబు డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు నాడు 2017లో రూ.830 కోట్లు.. మ‌ర‌లా 2024లో రూ.1000 కోట్లు ఇచ్చి న్యాయం చేసింది చంద్రబాబు అని పేర్కొన్నారు. 2019-24 మధ్య నిర్వాసితులకు ఒక్క రూపాయి సాయం లేదు.. పునరావాస కాలనీలకు ఒక్క అర బస్తా సిమెంట్ పని చేయ‌కుండా జగన్ దగా చేశాడని ఆరోపించారు. గత ప్రభుత్వ విధ్వంసం నుండి, మళ్లీ చంద్రబాబు ఆధ్వర్యంలో పోల‌వ‌రం పునర్నిర్మాణం జరిగి 2027 డిసెంబర్‌కు పూర్తవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Read Also: JP Nadda: ‘అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్‌సైక్లోపీడియా’: జేపీ నడ్డా