Site icon NTV Telugu

Karumuri Nageswara Rao: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది..

Karumuri

Karumuri

Karumuri Nageswara Rao: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది.. అమరావతిలో చంద్రబాబు సీన్ రివర్స్ అయింది.. మరో 40 వేల ఎకరాలు కావాలని చంద్రబాబు అడగడంతో అక్కడ రైతులు ఎదురు తిరుగుతున్నారు.. మా భూములు ఇచ్చేది లేదంటున్నారు.. రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనకు చేస్తూనే ఉన్నారు.. మామిడి రైతులు నిండా మునిగారని మాజీమంత్రి కారుమూరి పేర్కొన్నారు.

Read Also: Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి మార్చుకోవాల్సిందే..

ఇక, ప్రశ్నిస్తా అన్న వ్యక్తి అడ్రస్ లేడు మాజీమంత్రి కారుమూరి అన్నారు. రెండునెలలు అయిన ధాన్యం డబ్బులు రైతులకు ఇవ్వడం లేదు.. రైతుని పట్టించుకునే దిక్కులేదు.. సీజ్ ది షిప్ అన్న వ్యక్తి అమెరికాలో వెళ్ళి కూర్చున్నాడు.. పనికి ఆహారం  పథకంలో సైతం దోపిడీకి పాల్పడుతున్నారు.. 2027అక్టోబర్- నవంబర్ నాటికి ఎన్నికలు వస్తాయన్నారు.

Exit mobile version