Site icon NTV Telugu

Collectorate Controversy: కలెక్టరేట్ తరలింపు అంశంపై వివాదం

Bhimavaram

Bhimavaram

Collectorate Controversy: జిల్లాల పునర్విభజన తర్వాత భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైంది. పాలనకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో భీమవరం సమీపంలోని ప్రైవేటు కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కలెక్టరేట్ కోసం 20 ఎకరాల భూమి, 100 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2022 ఏప్రిల్ నాలుగు నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడిన సమయంలో ఏడో వార్డులోని ప్రైవేట్ కళాశాల భవనంలో కలెక్టరేట్ ఏర్పాటు చేశారు అన్ని శాఖల జిల్లా అధికారులు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం భీమవరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులోని 20 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది.. AMC కి సంబంధించిన భూమిని మార్కెటింగ్ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు బదిలాయిస్తూ 2023 మార్చి 24 జీవో జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ రికార్డులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మార్పులు చేసి 80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు.. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ గెజిట్ రద్దు చేసింది.

Read Also: Rajasthan: రాజస్థాన్‌లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఇటీవల ఉండి నియోజకవర్గం పెదమిరం సమీపంలో కలెక్టరేట్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కూటమినేతలు సీఎంను కలిసి విన్నవించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కలెక్టరేట్ తరలించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ఊపందుకున్నాయి. భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న  పులపర్తి రామాంజనేయులు ఈ అంశంపై స్పందించారు. భీమవరం నుంచి కలెక్టర్ రేటు ఎక్కడికి తరలిపోదని… కొంతమంది నాయకులు అధికారులు అలా భావించినా అదెప్పటికీ జరగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్మించాల్సిన కలెక్టరేట్‌ను ..p4 లో నిర్మించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భీమవరం నుంచి కలెక్టరేట్ తరలించాలని కొంతమంది కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సూచించారు. భీమవరం నుంచి కలెక్టరేట్ తరలిపోతే మిగతా నియోజకవర్గాల వారికి దూరం పెరిగి, రవాణ భారంగా మారుతుందన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు. కలెక్టరేట్ ను భీమవరం నుంచి తరలించే ప్రయత్నాలు మానుకోవాలని స్పష్టం చేస్తున్నారు స్థానికులు. నేతలు తమ రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి, కలెక్టరేట్ తరలింపు అంశాన్ని మానుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Exit mobile version