Site icon NTV Telugu

Chandrababu: జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుంది..

Babu 2

Babu 2

మూడు రాజధానులు అని ఏ ఒక్క రాజధాని లేకుండా చేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఐదేళ్లు రాజధాని లేకుండా పాలన చేయడం జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. మరోవైపు.. జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ మృతికి కారణం అని రిలయెన్స్ పై దాడులు చేశారు.. రిలయెన్స్ వాళ్ళు వస్తే రాజ్యసభ ఇచ్చి పంపించారని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ధనిక సీఎం జగన్.. పెద్దవాళ్ళకు, పెత్తందార్లకు యుద్ధం అంటున్నాడు అని అన్నారు. దేశంలో ధనిక సీఎం అయిన జగన్.. రాష్ట్ర ప్రజలను నిరుపేదలను చేశారని మండిపడ్డారు.

Read Also: Chandrababu: వైసీపీ సినిమా అయిపోయింది.. సీఎంపై చంద్రబాబు విమర్శలు

మరోవైపు.. డయాఫ్రం వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి.. అభివృద్ధి అంటే కోడిగుడ్డు అనేవాళ్ళు ఐటీ మంత్రి.. క్లబ్బులో డ్యాన్సులు వేసే వాళ్ళు మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు.. బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు అందరికీ న్యాయం చేయకుండా బస్సు యాత్రలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కాపులకు అన్యాయం జరిగింది.. టీడీపీ హయాంలో రిజర్వేషన్ ఇస్తే ఇపుడు తీసేసారని మండిపడ్డారు. రొయ్యల చెరువు తవ్వాలంటే, ఇల్లు కట్టాలన్న ఆచంట ఎమ్మెల్యేకి డబ్బు ఇవ్వాలి అని అన్నారు. పేదలకు ఇల్లు కట్టలేని నాయకులు ప్యాలెస్ లు కట్టుకుంటున్నారన్నారు. మరోవైపు.. అంబటి రాయుడు మంచి పేరున్న క్రికెటర్.. అతన్ని జగన్ పిలిచి గుంటూరు టికెట్ ఇస్తా అని తర్వాత రోజు ఇంకొకరికి జగన్ హామీ ఇచ్చారని అన్నారు. రాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యి పారిపోయాడని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే టిడ్కో ఇల్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read Also: Minister Bosta: మేము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు..

Exit mobile version