Botsa Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. తాట తీస్తాం, తోలు తీస్తాం, మక్కెలు ఇరగగొడతాం అంటారు.. మీరు ఎవరి మక్కెలు ఇరగగొడతారు? అని ప్రశ్నించారు. మేము అంత ఖాళీగా కూర్చొన్నామా? అంత చేతకాని వాళ్లమా? మాకేం రాదా? అని బొత్సా ప్రశ్నించారు.
Read Also:
ఇక, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్లం, చట్టం మీద గౌరవం ఉన్న వాళ్లం అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మీలాగ వచ్చి చట్టాలతో చీట్ చెయ్యాలని చూస్తే ఊరుకోం అని హెచ్చరించారు. రైతులు, మహిళలంటే గౌరవంతో ముందుకెళ్లేదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.
