Site icon NTV Telugu

Bolisetti Srinivas: రప్పా.. రప్పా.. నరకడానికి ఆయన ఏమైనా స్టేట్ రౌడీనా..?

Bolisetti Srinivas

Bolisetti Srinivas

Bolisetti Srinivas: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను ఇంకా రప్పా.. రప్పా.. డైలాగ్‌ వీడడం లేదు.. ప్లకార్డులపై ఎప్పుడైతే రప్పా.. రప్పా.. డైలాగ్‌ రాసి ప్రదర్శించారు.. అప్పటి నుంచి ఈ డైలాగ్‌ రాజకీయ నేతల నోట వింటూనే ఉన్నాం.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇలా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఈ డైలాగ్‌ చూట్టూనే కామెంట్లు చేస్తున్నారు.. తాజాగా, వైఎస్‌ జగన్‌పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్‌.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రప్పా.. రప్పా.. నరకడానికి వైఎస్‌ జగన్ ఏమన్నా స్టేట్ రౌడీనా? అని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వైఎస్‌ జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు రోడ్లపై తిరుగుతారా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. జగన్‌ రప్పా.. రప్పా లాడిస్తాడనే ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.. తండ్రి (వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి) హయంలో లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి వైఎస్‌ జగన్ అని ఆరోపించారు..

Read Also: Tamil Audience : తెలుగు సినిమాలపై ఏడుపు.. తమిళ తంబీలు మారరా?

రప్పా.. రప్పా అంటున్నారు కదా..? దమ్ముంటే ఎవరినైనా టచ్ చేసి చూడండి.. అంటూ సవాల్ చేశారు బొలిశెట్టి శ్రీనివాస్.. మరోవైపు, మేం రప్పా.. రప్పా ఆడించాలంటే 24 గంటలు చాలు.. కానీ మేం రౌడీలం కాదు అని పేర్కొన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌.

Exit mobile version