2 Rupees Biryani Offer: రూ. 2కే చికెన్ బిర్యానీ.. ఎగబడిన జనం..
- రూ.2కే బిర్యానీ ఆఫర్..
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రెస్టారంట్ ప్రారంభం సందర్భంగా ఆఫర్..
- రెండు రూపాయల బిర్యానీకి పోటెత్తిన జనం..
- భారీగా ట్రాఫిక్ జామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Rupees Biryani Offer: ఏదైనా నాన్‌వెజ్‌పై ఆఫర్ అంటే చాలు.. జనాలు అక్కడికి వాలిపోతుంటారు.. ఇక, బిర్యానీపై ఆఫర్ అని తెలిస్తే ఆగుతారా..? గతంలో బిర్యానీ ఆఫర్లకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివెళ్లి.. వాళ్లు ఇబ్బందిపడిన ఘటనలే కాదు.. పరిసర ప్రాంతాల వాసులను.. రోడ్లపై వెళ్లేవాళ్లు కూడా ఇబ్బందిపడేలా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఉషా గ్రాండ్ వద్ద ఓ రెస్టారంట్’ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అని ప్రకటించడంతో జనం పోటెత్తారు. దాదాపు 2 వేల మంది బిర్యానీ కోసం ఎగబడ్డారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఆఫర్ కింద కేవలం 200 బిర్యానీ ప్యాకెట్లను మాత్రమే విక్రయించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను అదుపుచేశారు.. రూ. 2కే బిర్యానీ అని చెప్పి కేవలం 200 మందికే ఇవ్వటంతో మిగిలిన వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా.. రూ.2కే చికెన్ బిర్యానీ 200 మందిని సంతృప్తి పరిచినా.. మిగతా వారిని మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది.. అంతేకాదు.. వేలాది మందిని ట్రాఫిక్ జామ్ ఇబ్బంది పెట్టింది.
Read Also: Congress Leader: షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..