CM Chandrababu: అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పను.. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబధిత అధికారులపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర నా లక్ష్యం.. అక్టోబర్ 2 తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు.. 2027 నాటికి మురుగు నీరు శుద్ధి చేసి వ్యవసాయానికి, ఇతర అవసరాలకు ఉపయోగిస్తామన్న ఆయన.. 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్న.. ఇది అరుదైన గౌరవం.. 9 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రానికి, ఇప్పుడు రెండో సారి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న.. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.
Read Also: AP Best Legislator Award: ఇక, ఏపీలో ఉత్తమ లేజిస్లేటర్ అవార్డు..!
స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. మోయలేని భారం నా మీద ఉంది.. మీరంతా అండగా నిలబడితే దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడతా అన్నారు.. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ప్రజా ప్రభుత్వం… గతంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి జనంలోకి వచ్చారా..? అని ప్రశ్నించారు.. ఒకవేళ వస్తే నేరుగా పరదాలు కట్టుకుని, హెలికాప్టర్ లో వెళ్తూ.. కింద చెట్లు నరికేసి వెళ్లేవారని దుయ్యబట్టారు.. నేను నాలుగోసారి ముఖ్యమంత్రి.. కానీ, గతంలో ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు ఎదురు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నిన్న, ఈ రోజు, రేపు గురించి ఆలోచిస్తా.. అందుకే 2004లో గెలిపించినందుకు హైదరాబాద్ ను ఎక్కడ నిలబెట్టమో గుర్తు చేసుకోవాలన్నారు.. ఎప్పుడైతే ఓకే ప్రభుత్వం కొనసాగితే అభివృద్ధి వేగవంతం అవుతుందన్న ఆయన.. దక్షిణ భారత దేశంలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలిందని వ్యాఖ్యానించారు.
Read Also: Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుంచి మహిళలకు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం
ఇక, ఆదాయ వనరులను నాశనం చేశారు.. గత ఐదేళ్లుగా కాలువల్లో మట్టి కూడా తీయలేదని విమర్శించారు చంద్రబాబు.. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర నా లక్ష్యం.. అక్టోబర్ 2తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. 2027నాటికి మురుగు నీరు శుద్ధి చేసి వ్యవసాయానికి ఇతర అవసరాలకు ఉపయోగిస్తాం అన్నారు.. అక్టోబర్ 2 తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పను.. కానీ, పరిసరాలు శుభ్రంగా లేకపోతే సంబధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.. గతంలో ఇంత టైం ఇచ్చే వాడిని కాదు.. అందుకే ఇప్పటినుంచే అధికారులు, ఎమ్మెల్యేలు మరింతగా పని చేయాలని ఆదేశించారు. ఈ రోజు బీజేపీతో కలిశాం కాబట్టి కాస్త డబ్బులు వచ్చాయి.. కష్టకాలంలో కేంద్రం సహాయం లేకపోతే ఇబ్బందులు తప్పవు అన్నారు.. గత ప్రభుత్వం చెత్త తీయలేదు.. కానీ, చెత్త పై పన్నులు వేశారని ఫైర్ అయ్యారు.. త్వరలో రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తాం.. పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం.. మే నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు అందిస్తామని వెల్లడించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..