NTV Telugu Site icon

BC Janardhan Reddy: 2025 జూన్లోగా రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం..!

Bc

Bc

BC Janardhan Reddy: 2025 జూన్ లోగా రామాయపట్నం పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. 2019లో సీఎం చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. రూ. 4929 కోట్ల వ్యయంతో పోర్ట్ నిర్మాణం కొనసాగుతుంది.. ఇప్పటి వరకు రూ. 1300 కోట్లతో 51 శాతం మేర పనులు పూర్తయ్యాయి.. ప్రతి నెలా పోర్ట్ పనుల పురోగతిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించామని బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: DK Shivakumar: నన్ను జైలులో పెట్టే కుట్ర జరుగుతోంది..

రామాయపట్నం చరిత్రలో ఈరోజు మరపురాని రోజు అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి విమానాశ్రయం, రామాయపట్నం పోర్ట్ మేజర్ ప్రాజెక్టులను పరిశీలించి సమీక్ష చేయడం శుభపరిణామం.. రానున్న ఐదేళ్లలో నెల్లూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. రామాయపట్నం పోర్ట్ తో ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పోర్ట్ సమీప గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.. వీలైనంత త్వరగా పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి రామానారాయణ రెడ్డి వెల్లడించారు.