Site icon NTV Telugu

Botsa Satyanarayana: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం మౌనం..

Botsa

Botsa

Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీన లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్ జగన్ ములాఖాత్ వాయిదా పడింది అన్నారు. అలాగే, వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండే అవకాశం ఉంది.. రాష్ట్రంలలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి.. ప్రజాస్వామ్యం కలిగిన ప్రభుత్వం లేదు.. స్వార్థం కోసం పనులు జరుగుతున్నాయి.. ఇది మంచి సాంప్రదాయం కాదని కూటమి సర్కార్ ను హెచ్చరిస్తున్నాం.. ఏ వర్గం చూసుకున్నా సంతృప్తికరంగా లేదు.. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తుంది.. రైతులు, రైతు కూలీలు , విద్యార్థులు, వ్యాపారులకు అన్యాయం జరుగుతుంది.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయం తప్ప రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాలోని 60 నుంచి 70 వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందలేదు.. తల్లికి వందనం పథకం పూర్తి స్థాయిలో అందించలేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read Also: Rekha Gupta: రేఖా గుప్తాను పరామర్శించిన బీజేపీ ఎంపీలు.. దాడి తర్వాత సీఎం ఫొటో విడుదల

ఇక, లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి డబ్బులు ఏమి చేశారని మాజీమంత్రి బొత్స ప్రశ్నించారు. రోడ్లు నిర్మాణాలు ఎక్కడా…? ఒక్క రోడ్డు వేయడం లేదన్నారు. అలాగే, అత్యాచారాలు పెరిగిపోయాయి.. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప మరి ఏం చేయడం లేదు.. గడిచిన 14 నెలల పాలనలో నేరాలు ఘోరంగా పెరిగాయి.. ఇదేనా మంచి పరిపాలన?.. ప్రజా ప్రతినిధులు వారి తాబేదారులతో కలిసి భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నాడు రాజీనామాలకు సిద్ధపడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమైపోయారని అడిగారు. 14 నెలలుగా ఢిల్లీ వెళ్తున ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారు.. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడటం లేదు అని ఎమ్మెల్యే సత్యనారాయణ క్వశ్చన్ చేశారు.

Read Also: Minister Seethakka: జంపన్న వాగును అభివృద్ధి చేస్తాం.. 29 ఎకరాల్లో స్మృతి వనం!

అయితే, విశాఖ ఉక్కుపై కలిసివచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. యూరియా బస్తా ఇవ్వాలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఈ సర్కార్ కు చిత్తశుద్ధి లేదు.. చంద్రబాబు ఇచ్చిన వాగ్థానాలు అన్ని అబద్దం.. దీనిపై నిలదీస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టవలసి వస్తే ముందు చంద్రబాబుపై పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Exit mobile version