Site icon NTV Telugu

Tragedy in the wedding house: పెళ్లి ఇంట విషాదం.. తెల్లారితే పెళ్లి అనగా విద్యుత్‌ షాక్‌తో…

Tragedy

Tragedy

Tragedy in the wedding house: పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంటిలో చావు డప్పులు మోగిన ఘటన మన్యం జిల్లా గౌరీపురం గ్రామంలో చోటుచేసుకుంది. తెల్లవారితే తన తమ్ముడు లక్ష్మణరావు వివాహం జరిపేందుకు అన్న చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు పెళ్లి చేయడానికి సిద్ధపడి ఏర్పాట్లలో మునిగిపోయారు.. అయితే, రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో పెళ్లి కుమారుడి అన్న చంద్రశేఖర్‌ మృతి చెంది అనంతలోకాలకు వెళ్లిపోయాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ చంద్రశేఖర్ మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. తండ్రి లేనప్పటికి తండ్రిలా చూసుకునే అన్న మరణించడంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తన అన్నను కోల్పోయి పెళ్లికుమారుడు లక్ష్మణరావును ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు..

Read Also: Pakistan : పాకిస్థాన్‌లో నెత్తురోడుతున్న భూమి.. ఐదుగురు మృతి

Exit mobile version