Site icon NTV Telugu

NIA: పేలుళ్ల కుట్ర కేసులో కూపీ లాగుతున్న ఎన్‌ఐఏ.. ఏ నగరాలను టార్గెట్ చేసారు..?

Nia

Nia

NIA: బాంబు పేలుళ్లకు ప్లాన్‌ చేసిన ఉగ్రవాదులు సిరాజ్‌, సమీర్‌లను విజయనగరం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిద్దరినీ 7 రోజుల కస్టడీకి ఇస్తూ గురువారం సాయంత్రమే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. వారిద్దరూ విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. శుక్రవారం ఉదయమే విశాఖ సెంట్రల్‌ జైలుకు చేరుకున్న విజయనగరం పోలీసులు… సిరాజ్‌, సమీర్‌లను కస్టడీలోకి తీసుకుని విజయనగరంలోని పోలీస్‌ ట్రెయినింగ్‌ కాలేజీకి తరలించారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ మాధవరెడ్డి, ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు. అందరూ కలసి సంయుక్తంగా సిరాజ్‌, సమీర్‌లను ప్రశ్నించారు.

Read Also: Germany: రైల్వే స్టేషన్‌లో కత్తితో మహిళ వీరంగం.. 12 మందికి తీవ్రగాయాలు

కస్టడీలో సిరాజ్‌, సమీర్‌ల నుంచి పూర్తి వివరాలు రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఏ ఏ నగరాలను టార్గెట్ చేశారు..? ఎవరెవరిని కాంటాక్ట్‌ అయ్యారు..? ప్లాన్‌ని ఎప్పుడు, ఎలా అమలు చేయాలనుకున్నారనేది ఆరా తీస్తున్నారు. వీళ్లని ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు..? సౌదీ అరేబియా నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు..? పేలుళ్ల కుట్ర వెనుక.. అసలేం జరిగింది..? ఉగ్ర కార్యకలాపాలకు పాక్ టెర్రరిస్ట్ సంస్థలు సౌదీని వాడుకుంటున్నాయా..? అనే కోణంలోనూ ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఉగ్రసంస్థకు చెందిన హ్యాండ్లర్… వరుసగా రిక్రూట్ చేసుకోవడం, వారిని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్‌ కావడంపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా పేలుళ్లకు జరపాలనుకున్నారనే విషయాలే కాకుండా… ఉగ్ర కార్యకలాపాలకు అవసరమైన ఆర్థికసాయం గురించి కూడా ఆరా తీస్తున్నారు అధికారులు.

Read Also: Nizamabad: జక్రాన్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బావ బామ్మర్దుల మృతి

సిరాజ్, సయ్యద్‌ సమీర్‌ లాంటివాళ్లు మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్న ఎన్‌ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్, వరంగల్‌ సహా దేశ, విదేశాల్లో ఉగ్రవాద భావజాలమున్న యువకులతో వీరికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. సిరాజ్‌ లాంటివాళ్లు మరికొందరు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక, ఉగ్ర కుట్ర నిందుతులు సిరాజ్, సమీర్‌ను నేడు రెండో రోజు విచారించనుంది ఎన్‌ఐఏ.. సిరాజ్ ఎక్కడెక్కడ కుట్ర ప్లాన్ చేసారు అన్న కోణంలోనే విచారణ సాగనుంది.. ఉగ్ర లింక్స్, పరిచయాలపైనేలు, ఎంత డబ్బులు ఇచ్చారు, వాటితో ఏం కొనుగోలు చేసారు.. బాంబుల తయాలికి ఏమైనా శిక్షణ ఇచ్చారా..? వాళ్ల టార్గెల్ ఎవ్వరు? పెద్ద వ్యక్తుల అంటే ఏ స్థాయి వాళ్లు? అన్న కోణంలోనే ఎన్‌ఐఏ విచారణ సాగనుంది..

Exit mobile version