Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెక్కలు ఇచ్చారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్ర నేలపై నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పవర్ ఇంజిన్‌లా మారబోతోందని లోకేశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలిచి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపునిస్తుందని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని లోకేశ్ తెలిపారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ విమానాశ్రయం ద్వారా మరింత అభివృద్ధి చెందడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు కూడా గణనీయంగా తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాదన్న ప్రాంతంలో” నేడు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితమైందని, అదే వేదికపై ప్రధాని మోదీ హాజరుకావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని లోకేష్ అన్నారు. కేవలం రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసిన జీఎంఆర్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు మంత్రి నారా లోకేష్..
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!