Site icon NTV Telugu

Atchannaidu: అన్ని శాఖల్లో సమీక్ష నిర్వహించాం.. నిధులు లేవు..

Atchnaidu

Atchnaidu

Atchannaidu: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Read Also: Maoist Party: ఏజన్సీ ప్రాతంలో టెన్షన్.. టెన్షన్.. నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ఇక, విద్య, వైద్యం, వ్యవసాయం, త్రాగు, సాగునీటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాయే కానీ, ఏలాంటి సేవలు అందించడం‌ లేదని పేర్కొన్నారు. గిరిశికర గ్రామాలకు రానున్న రెండు ఏళ్లల్లో రాకపోకలకు రోడ్లు వేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలపై సమీక్షలు చేశాం.. ఏ శాఖలోని నిధులు లేవు.. నిధులు వచ్చే విధంగా కార్యచరణ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Exit mobile version