Site icon NTV Telugu

Home Minister Anitha: అధికారులపై హోంమంత్రి అనిత సీరియస్‌.. చర్యలు తప్పవని వార్నింగ్..

Vangalapudianitha

Vangalapudianitha

Home Minister Anitha: అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విజయనగరం కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరైన ఆమె.. డీఆర్సీలో అధికారుల‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏదో కాకి లెక్కలతో కాగితాల దొంతులుగా ప్రెస్‌నోట్‌ మా కిచ్చి వెళ్లిపోతున్నారని ఫైర్‌ అయ్యారు.. కానీ, ఆ పేపర్లు తర్వాత చెత్త బుట్టలోకి వెళ్లిపోతున్నాయి.. అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు.. కానీ, ఇక ఇలాంటి పద్దతికి చెల్లు చీటు చెప్పండి… ఇక నుంచి ముందే కలెక్టర్ వద్ద గత డీఆర్సీలో ఏం చేశామో చర్చించండి.. ఎంత వరకు పూర్తి చేశామో ముందే బ్రీఫ్ చేసి పెట్టుకోండి అని ఆదేశించారు..

Read Also: AP Crime: ఎన్టీఆర్ జిల్లాలో మహిళ సూసైడ్‌ కలకలం.. సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యేకి వినతి..!

విజయనగరం వెనుకబడిన జిల్లా అంటారు.. ఎవ్వరన్నారు వెనుకబడిన జిల్లా అని… జిల్లాకి అన్ని వనరులు ఉన్నాయి.. వర్షపాతం అధికంగా ఉన్నాయి.. నీటి నిలువలు అధికంగా ఉన్నాయన్నారు హోంమంత్రి అనిత.. అధికారులు ఏం పని చేస్తున్నారో నాకు అర్ధం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ డీఆర్సీలో ప్రజాప్రతినిధులు ఏ సమస్యలు లేవనెత్తినా.. ఆ తర్వాత అది ఎంత మేర పరిష్కరించగలిగామో చెప్పాలి.. లేనిపక్షంలో కచ్చితంగా చర్యలు తప్పవు అని వార్నింగ్‌ ఇచ్చారు.. ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలో హెవీ లోడ్స్ తో వెళ్లిన వాహనాలు ఎన్ని ఉన్నాయో ఆర్ అండ్ బీ, ఆర్టీవో సమన్వయంతో గుర్తించాలని అడిగా… కానీ, ఇంత వరకు ఎందుకు సమన్వయ సమావేశం పెట్టుకోలేదు? అని నిలదీశారు.. ఇలా అయితే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని ఆర్ అండ్ బీ అధికారులపై మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు..

Exit mobile version