Site icon NTV Telugu

Singh Nagar floods: సింగ్నగర్ వరద ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..

Chandranna

Chandranna

Singh Nagar floods: విజయవాడ నగరంలోని సింగ్నగర్లో వరద బీభత్సం సృష్టించింది. దీని వల్ల సింగ్నగర్ పూర్తిగా నీట మునిగింది. ఇక, సింగ్ నగర్ లో వరద ఉధృతి ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ప్రత్యేక బోటులో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, నారాయణ, కొల్లు రవీంద్ర ఉన్నారు. అయితే, ఈ వదర ప్రభావం వల్ల ఇబ్బంది పడిన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

Exit mobile version