NTV Telugu Site icon

Vizag Student Died: రైలు దిగుతూ జారిపడి… చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి

College Student

College Student

విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో తీవ్రంగా గాయపడి గంటకు పైగా శ్రమించి కాపాడిన విద్యార్దిని ప్రాణాలు దక్కలేదు. రైలు దిగుతూ జారి పడి ట్రైన్ – ప్లాట్ ఫాం మధ్య చిక్కుకుని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శశికళ మృతిచెందింది. నడుము భాగంలో తీవ్రంగా ఒత్తుకుపోవడంతో అవయవాలు దెబ్బతిన్నాయి. అంతర్గత రక్త స్రావం కావడంతో నిన్నటి నుంచి హాస్పిటల్ లో అత్యవసర చికిత్స అందించారు. చివరి క్షణం వరకు పోరాడి మరణించింది శశికళ. ఫ్లాట్ ఫాం కు ట్రైన్ కు మధ్య ఇరుక్కుని బయటకు రాలేక ఆర్తనాదాలు చేసింది విద్యార్ధిని శశికళ.

దాదాపు గంటకు పైగా ట్రైన్ ను ఆపేసి ఫ్లాట్ ఫాంను తొలగించి రక్షించారు రైల్వే సిబ్బంది. అయినా శశికళ ప్రాణాలు దక్కకపోవడం విషాదం నింపింది. విశాఖలో ఫ్లాట్‌ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయి గంటల తరబడి నరకం చూసింది ఆ విద్యార్థిని.. విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ.. దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ అభ్యసిస్తోంది.. రోజులాగే గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ లో దువ్వాడ చేరుకున్న ఆమె.. స్టేషన్‌లో రన్నింగ్‌లో ఉన్న రైలు నుంచి దిగుతోంది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపోయింది.. ఊహించని ఈ ఘటనతో ప్లాట్‌ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయిన ఆ యువతి గంటల తరబడి నరకం చూసింది.

Uttarpradesh Bypolls: యూపీ ఉపఎన్నికల్లో ఎస్పీ కూటమిదే హవా.. డింపుల్ యాదవ్‌ నయా రికార్డ్‌..

ఇదిలా ఉంటే.. ఆమె బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.. రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు కూడా ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ విషయం రైల్వే స్టేషన్‌ సిబ్బందికి తెలిపారు ప్రయాణికులు. వెంటనే స్పందించిన రైల్వే రెస్క్యూ టీమ్‌.. విద్యార్థిని ఇరుక్కుపోయిన ప్రదేశంలో ప్లాట్‌ఫామ్‌ను బద్దలుకొట్టారు.. ఆ తర్వాత ఆమెను బయటకు తీశారు.. ఇలా దాదాపు రెండు గంటల పాటు ఆ విద్యార్ధిని నరకం చూసింది.. ఆమెను వెలికితీసిన తర్వాత ఆస్పత్రికి తరలించారు.. అయితే, ఆస్పత్రిలో వైద్యులు ఆమెను బతికించేందుకు ప్రయత్నించినా కుదరలేదు.

Read Also: Ram Gopal Varma: 400 మంది అమ్మాయిలతో సెక్స్ చేశా.. అందులో బాగా ఎవరు నచ్చారంటే..?

Show comments