Vizag Global Summit Is Fake Says Nadendla Manohar: విశాఖపట్టణం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒక బూటకమని, అంకెల గారడీతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీ-పూడ్స్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డును సీ-పూడ్స్‌లో కలిపి చూపడాన్ని బట్టి.. మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము ఇన్వెస్టర్లను తప్పు పట్టడం లేదని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో రూ.170 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో పనులు చేస్తే.. మెరుగైన పెట్టుబడులు వస్తాయని సూచించారు. అందుకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు.
Ayodhya Mosque: అయోధ్య మసీదు నిర్మాణానికి తుది అనుమతి..
అంతకుముందు.. ఇప్పటం గ్రామంలోని కూల్చివేతలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ చేపడతామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటంలో అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు. మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే అందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నామని స్పష్టం చేశారు. సీఎం జగన్ పైశాచిక ఆనందంతో ఇప్పటం గ్రామంలో భూములిచ్చిన రైతుల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపణలు చేశారు. విశాఖ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతో తాము వైసీపీపై విమర్శలు చేయకూడదని అనుకున్నామని.. కానీ వైపీసీ కావాలనే ఇప్పటం గొడవను రెచ్చగొట్టారని.. అందుకే విమర్శలు చేయక తప్పట్లేదని అన్నారు. జనసేన తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Tirupati Extramarital Affair: భార్య ఎఫైర్.. భర్తకు శిరోముండనం చేసిన నిందితులు అరెస్ట్