ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.26వేల కోట్లతో విశాఖ రిఫైనరీ విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని రిఫైనరీ ప్రాజెక్టును రూ.26,264 కోట్లతో ఆధునీకరించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అంగీకారం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందన్నారు.
Read Also: ఏపీకి ‘ప్రత్యేక హోదా’పై కుంటిసాకులు ఎందుకు..?
Also Read
ఈ ప్రాజెక్టు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరతాయని, విశాఖ రిఫైనరీ ఆధునీకరణ కోసం స్థానిక ఉత్పత్తులనే ఉపయోగిస్తామని కేంద్రమంత్రి రామేశ్వర్ వెల్లడించారు. కాగా హెచ్‌పీసీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో ఆధునీకరణ, విస్తరణ పనులు చేపట్టడం ఇదే తొలిసారి అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లక్షల మందికి జీవనోపాధి కలుగుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రాభివృద్ధికి, పన్నుల రూపంలో ఆదాయానికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని జీవీఎల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!